NZB: నగరంలో ఆదివారం నిర్వహించిన గ్రామ పాలన అధికారుల రాత పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన గ్రామ పాలన అధికారుల రాత పరీక్షకు 332 మందికి గాను 302 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. 30 మంది గైర్హాజరైనట్లు ఆయన వివరించారు.