ATP: కళ్యాణదుర్గం పట్టణంలోని వన్నూరుస్వామి కొండలో శనివారం రోషన్ షా వలి ఉరుసు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదట స్వామి వారిని పట్టణ పురవీధులలో ఊరేగించారు. అనంతరం స్వామి వారిని కొండపైకి తీసుకెళ్లారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.