NTR: నందిగామ పశుసంవర్ధక శాఖ డివిజన్ ఉపసంచాలకులు వారి కార్యాలయంలో అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేడీ డాక్టర్ హనుమంతరావు పాల్గొని మాట్లాడుతూ.. పశు వైద్యాధికారులంతా నిర్దేశించబడిన సమయానికి తమ లక్ష్యాలను చేరుకునే విధంగా కృషి చేయాలన్నారు. పాడి రైతులకు సబ్సిడీపై పశువుల దానా, జొన్న విత్తనాలు పాడి రైతులకు అందించాలన్నారు.