ప్రకాశం: మార్కాపురం డిజైన్ స్లేట్స్ కార్మికుల, ఓనర్స్ మధ్య చర్చలు శనివారం సఫలమయ్యాయి. కార్మికుల కూలీలు పెంచేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. ఇరువురి మధ్య నూతన ఒప్పందం జరిగిందని CITU జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ, డిజైన్స్ స్వీట్స్ యూనియన్ కార్యదర్శి రూబేను తెలిపారు. ఈ కార్యక్రమంలో యజమానులు పోలిరెడ్డి, గుప్త ప్రసాద్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.