ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు మూడు నెలల పాటు జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కోర్సులో శిక్షణ ఉన్నట్లు కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఉషారాణి శనివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. 17 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులని తెలిపారు. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.