SKLM: మెలియాపుట్టి మండలం మూలనేలబొంతు గ్రామాన్ని నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా దత్తత తీసుకోవడం జరిగిందని దత్తత అధికారి నరసన్నపేట ఎక్సైజ్ శాఖ సీఐ రమణమూర్తి తెలిపారు. శనివారం గ్రామంలో సర్పంచ్ ఆరుద్ర, గ్రామ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలో సారా అమ్మకాలు గాని, బట్టీలు ఏర్పాటు చేయడం లేదని ప్రకటించారన్నారు. సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దినందుకు అభినందించారు.