ప్రకాశం: మార్కాపురం మండలం చింతగుంట్ల గ్రామంలో విద్యుత్ షాక్తో గేదెలు మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం యజమానులను బీజేపీ ఇంఛార్జ్ పివి కృష్ణారావు కలిసి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు నష్టపరిహారం వచ్చే విధంగా విద్యుత్ డిపార్ట్మెంట్ వారు సహకరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.