సంగం మండలంలోని కొరిమెర్ల సమీపంలో రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. రోడ్డు దాటుతున్న ఆరేళ్ల చిన్నారి ఆయేషాను కారు ఢీ కొట్టింది. స్థానికులు సహాయంతో ఆ చిన్నారిని పీహెచ్సీకి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. వివరాలు సేకరించి పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారి మృతితో ఆస్పత్రి వద్ద రోదనలు మిన్నంటాయి.