ATP: గుంతకల్లు పట్టణంలోని హనుమాన్ సర్కిల్లో రైలు కిందపడి శ్రీనివాసులు అనే యువకుడు శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది.