SDPT: నేత్రదానం మహాదానమని లయన్ నంగునూరి సత్యనారాయణ అన్నారు. గజ్వేల్ పట్టణానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు రచ్చ లక్ష్మీ అకాల మరణం చెందగా, వారి కుటుంబ సభ్యుల సమ్మతితో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో మృతురాలు రచ్చ లక్ష్మి నేత్రాలు కంటి వైద్యులు సేకరించారు. ఈ సందర్భంగా లయన్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ.. నేత్ర దానం మహా దానం అని అన్నారు.