NLG: అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం నకిరేకల్ మండలం నోముల గ్రామంలో నిర్వహించిన కనకదుర్గమ్మ అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.