కోనసీమ: అమలాపురం పట్టణంలో నూతనంగా క్రైమ్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ కృష్ణారావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనసీమ జిల్లా ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు క్రైమ్ విభాగానికి ఇప్పటి వరకు స్టేషన్ లేదు. ఇన్స్పెక్టర్ గజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో శరవేగంగా నూతన పోలీస్ స్టేషన్ను నిర్మించారు.