కోనసీమ: ప్రజల సమస్యలకు సరైన పరిష్కార వేదిక ప్రజాదర్బార్ అని, ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం ఎమ్మెల్యే ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలకు నేరుగా పరిష్కారం మార్గం చూపేందుకు ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.