ADB: జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం తనిఖీ చేశారు. దుకాణ యజమానులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు విక్రయించే విత్తనాల ప్యాకెట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. రైతులకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.