HYD: భాగ్యనగరంలో అందాల పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు టాప్- 24 ఎంపిక చేశారు. శుక్రవారం వీరిలోంచి 8 మందిని ఎంపిక చేస్తారు. ఒక్కో ఖండం నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. వీరిలో నలుగురు ఈ నెల 31న జరిగే ఫైనల్స్‌లో పాల్గొంటారు. వీరిలో ఒకరిని విజేతగా, మిగిలిన ముగ్గురిని రన్నరప్‌లు గా ప్రకటిస్తారు. యూరప్, ఆసియా, ఓసియానా, ఆఫ్రికా ముద్దుగుమ్మలు పోటీలోఉండబోతున్నారు.