MNCL: తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం నకిలీ పత్తి విత్తనాలపై పోలీసు, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. సీఐ కుమారస్వామి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు వాడడం వల్ల భూమి సారవంతం కోల్పోయి పంట దిగుబడి తగ్గుతుందన్నారు. వీటి వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, నకిలీ విత్తనాలు అమ్మడం, కొనడం చేయవద్దన్నారు.