NTR: నాన్ ఇంటర్లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా సికింద్రాబాద్-గుంటూరు మధ్య ప్రయాణించే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12706/12705 సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ రైళ్లను శుక్రవారం నుంచి ఈ నెల 29 వరకు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు కోరారు.