ప్రకాశం: కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన టంగుటూరు మండలంలోని జమ్ములపాలెంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్ముల పాలెంలోని వీధి కుక్కలు పొలాలలో నుంచి బయటకి వచ్చిన జింకపై దాడి చేసి గాయపరచడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచి చనిపోయిందని తెలిపారు. జింక పిల్ల కుక్కల దాడి నుంచి తప్పించుకొని పారిపోయిందని అన్నారు.