SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు వెంకటాపూర్ గ్రామాలో ఐదు జీవాలు గురువారం విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాయి. మండల కేంద్రంలోని రాములు గొర్రెలు వర్షానికి డివైడర్ పైకి ఎక్కగా, మధ్యలో ఉన్న కరెంటు స్తంభాలకు అమర్చిన ఏర్త్వైర్కు విద్యుత్ సరఫరా కావడంతో రెండు గొర్రెలు, మూడు మేకలు గ్రామ శివారులో కరెంట్ షాక్తో మృత్యువాత పడ్డాయన్నారు.