HNK: పట్టణ కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ లేడీ హాస్టల్లో పాము కలకలం సృష్టించింది. దీంతో రెండు గంటలపాటు విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. హాస్టల్లో పాములు తిరగడం పై విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. అనంతరం రెస్క్యూ టీంకు సమాచారం అందించగా, వారు వచ్చి పామును పట్టుకున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ సమస్యకు కారణమని విద్యార్థులు ఆరోపించారు.