NLG: కొండమల్లేపల్లి మండలం కొలుముంతల్ పహాడ్, మంత్రియ తండాలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే బాలునాయక్ బుధవారం ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసనికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని తెలిపారు. క్రీడల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా తదితరులున్నారు.