NLR: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం విజయవంతం అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఇందుకూరుపేటలో తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు మండలంలోని కొత్తూరు పంచాయతీ కార్యాలయం నుంచి మండల ఆఫీస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.