BHPL: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్లు, దేవాలయం, పార్కింగ్ ప్రాంతాలు, రహదారుల్లో 220 సీసీ కెమెరాలు అమర్చారు. భద్రత కోసం ఐదు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో భక్తుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు బుధవారం ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు.