SRPT: కృష్ణానదిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చింతలపాలెం మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..చింతలపాలెం గ్రామానికి చెందిన పార్వతీశం గేదెలను తోలుకుని మంగళవారం కృష్ణా నదికి వెళ్ళాడు. వాటిని బయటకు తోలుకొచ్చే క్రమంలో కృష్ణ నదిలో గల్లంతయ్యాడు. కాగా బుధవారం తెల్లవారుజామున స్థానికులు మృతదేహాన్ని గుర్తించి బయటకి తీశారు.