KRNL: కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చిందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. జూలై 2 నుంచి సోమ, బుధ, శుక్రవారాల్లో ఈ సర్వీసు నడుస్తుందని చెప్పారు. త్వరలో ప్రతి రోజూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి భరత్ మంగళవారం థాంక్స్ చెప్పారు.