KRNL: తాగునీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని కర్నూలు నగరపాలక కమిషనర్ యస్. రవీంద్ర బాబు హెచ్చరించారు. బుధవారం బాపూజీ నగర్, సి. క్యాంపు రైతు బజార్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన తాగునీటిని వాహనాలు కడగటానికి వాడుతున్న వారి కొళాయి కనెక్షన్ కట్ చేయాలని అధికారులకు ఆదేశించారు. డ్రైనేజీ సమస్యలపై సిల్ట్ తొలగింపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు.