క్రికెటర్ చాహల్, ఆర్జే మహ్వశ్లు డేటింగ్ చేస్తున్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. చాహల్లో ఏ లక్షణం మీకు బాగా నచ్చిందని మహ్వశ్కు ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీనికి చాహల్ నిజంగా చాలా కేర్ తీసుకునే వ్యక్తి అని కితాబిచ్చింది. ప్రేమించే వ్యక్తులకు అందుబాటులో ఉండే అతని లక్షణాన్ని తాను కూడా అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నట్లు వ్యాఖ్యానించింది.