VSR: జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆదివారం బాబు జగ్జీవన్ వర్ధంతి నిర్వహించారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న దళితుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.