MBNR: ఎరుకలకు ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని జిల్లా ఎరుకల సంఘం చైర్మన్ వెంకటేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఏకలవ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలన్నారు.