KNR: ఏషియన్ పవర్ లిఫ్టింగ్ జానియర్ విభాగంలో కాంస్య పతకం సాధించిన సిరి చందనను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు. ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్లో ఉంటూ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న సిరి చందన డెహ్రాడూన్లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ జానియర్ విభాగంలో కాంస్యం, ఏషియన్ యూనివర్సిటీ స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించింది.