KMM: కరెంట్ షాక్తో యువతి మృతిచెందిన ఘటన అన్నపురెడ్డిపల్లి మండలం మర్రిగూడెంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. అబ్బుగూడెంకి చెందిన మామిడి రెమెల్య మర్రిగూడెంలో కూలీకి వెళ్లింది. ఈక్రమంలో ధాన్యం తూర్పార పోసే మిషన్ ద్వారా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె చెల్లికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమచారం తెలియాల్సి ఉంది.