ATP: బ్రహ్మసముద్రం మండలం సూగేపల్లి-ఐదుకల్లు రహదారి భారీ వర్షం కారణంగా కోతకు గురైంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కుండపోత వర్షంతో రహదారి పూర్తిగా దెబ్బతినింది. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. మరోవైపు మండలంలోని సంతే కొండాపురం చెరువుకు వర్షం నీరు భారీగా చేరుతోంది.