WGL: జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 16న(శుక్రవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిని రజిత గురువారం తెలిపారు. ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉ.11 గం.లకు ములుగు రోడ్డులోని ఎంప్లాయిమెంట్ కార్యాలయం వద్ద ఈ మేళా ఉంటుందన్నారు. వివరాల కోసం 7093168646 సంప్రదించాలన్నారు.