NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రితో ఘనంగా ముగిశాయి. ఈ నెల 8 నుండి 14వ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. చివరి రోజు సందర్భంగా భక్తులు పెంచలకోనకు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదలను స్వీకరించారు.