MBNR: జడ్చర్ల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రవి నాయక్‌ను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కోరారు. కొన్ని మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదనే ఫిర్యాదులు తన దృష్టికి రావడంతో ఈ విషయంపై ఎమ్మెల్యే సివిల్ సప్లై డీఎంతో ఫోన్లో మాట్లాడారు.