అన్నమయ్య: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా పంచాయతీ అధికారుల సూచనలతో నేడు నందలూరు మండలంలోని వైసీపల్లె గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో రాధాకృష్ణంరాజు తెలిపారు. ఉదయం 11 గంటలకు పంచాయతీ వార్డు సభ్యులందరూ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించే సమావేశంలో తప్పక హాజరు కావాలని ఎంపీడీవో కోరారు.