KMR: ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యాబోధన చేయడం జరుగుతోందని, తెలంగాణ టీచర్స్ యూనియన్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండీ ముజిబొద్దీన్ అన్నారు. శనివారం ఎల్లారెడ్డి మండల కొట్టాల్ గ్రామ ఎంపిపిఎస్ పాఠశాల ఆవరణలో మెగా పి. టి. యం. సమావేశము నిర్వహించారు. గ్రామంలోని 5 నుండి 14 ఏండ్ల వయస్సు గల పిల్లలందరు బడిలో చదువుకోవాలన్నారు.