KMM: వైరా ఏసీపీ ఎం.ఏ.రెహమాన్‌ను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆయన స్థానంలో హైదరాబాద్ పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న ఎస్.సారంగపాణిని నియమించారు. సుమారు మూడేళ్ల పాటు ఇక్కడ విధులు నిర్వర్తించిన రెహమాన్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన మరో నాలుగు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు.