BDK: సుజాతనగర్ BSP నాయకుల ఆధ్వర్యంలో ఎంపీడీవోకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా చూడాలని ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే కేటాయించాలని తెలిపారు. డబ్బున్న వాళ్లకు రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లకు కేటాయించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో BSP సుజాతనగర్ మండల కమిటీ పాల్గొన్నారు.