టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘#సింగిల్’ మూవీ ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రన్ టైం లాక్ అయినట్లు తెలుస్తోంది. 2:05 నిమిషాల నిడివితో ఇది థియేటర్లలోకి రాబోతున్నట్లు సమాచారం. ఇక కార్తీక్ రాజు తెరకెక్కించిన ఈ మూవీలో కేతిక శర్మ, ఇవానా కీలక పాత్రలు పోషించారు.