కృష్ణా: ముసునూరు మండల పరిధిలో ఉన్న ఎక్సైజ్ పాత నేరాలలోని ఆరుగురు వ్యక్తులను మండల తహసీల్దార్ ఎదుట శనివారం బైండోవర్ చేసినట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ ఏ మస్తానయ్య తెలిపారు. తహసీల్దార్ రాజకుమార్ మాట్లాడుతూ.. బైండోవర్ ఏడాది పాటు కొనసాగుతుందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ. లక్ష జరిమానా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.