ADB: జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం సంచలనం సృష్టించిన కీర్తి హత్య అతి కిరాతకంగా హత్య చేసిన భర్త మారుతి కూడా స్థానిక వాగు పక్కన గల కాల్వలో శవమై తేలాడు. కీర్తిని హత్య చేసి పరారైన మారుతి అదే రోజు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, కీర్తి మారుతి మృతి చెందడంతో వారి ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.