HNK: జాతరను తలపించే విధంగా రజతోత్సవ సభకు ప్రజలు తరలివస్తున్నారని జిల్లా BRS అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా నాయకత్వం సమిష్టిగా పనిచేసి, వచ్చే ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని, సభకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని తెలిపారు.