AP: విశాఖ రఘు ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌ను చెప్పుతో కొట్టిన వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. లేడీ ఫ్యాకల్టీపై చేయిచేసుకోవడం, తిట్టడంతో ECE సెకండ్ ఇయర్‌కు చెందిన వెంకటలక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చింది. కాలేజీ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.