ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె భరత్ కుమార్ నాయక్ మరియు అధ్యాపకులు కలిసి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి పరిరక్షించాలని ప్రిన్సిపాల్ అన్నారు.