SKLM: సీతంపేట మండల రేగులగూడ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో సవర లక్ష్మణరావు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న పాలకొండ ఎమ్మెల్యే జయక్రిష్ణ కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. వారికి స్వయంగా కొంత ఆర్ధిక సహాయం చేశారు. ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించుటకు తగు చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు.