CSKతో జరిగిన మ్యాచ్‌లో SRH బౌలర్ హర్షల్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ధోనీ వికెట్ తీశాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ధోనీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు బౌలర్‌పై ఒత్తిడి ఉంటుందని తెలిపాడు. వికెట్లకు దూరంగా అస్సలు బౌలింగ్ చేయకూడదని.. ఆ బంతులను ధోనీ బాదేస్తాడని చెప్పాడు. అందుకే లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసి ఫలితం రాబట్టగలిగినట్లు చెప్పుకొచ్చాడు.