జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో భారత బాక్సర్లు పంచ్లతో చెలరేగుతున్నారు. ప్రత్యర్థులను అలవోకగా చిత్తు చేస్తూ పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే 39 పతకాలు ఖరారు కాగా, ఇవాళ మరో నలుగురు సెమీ ఫైనల్కు దూసుకెళ్లారు. దీంతో ఈసారి దాదాపు 43 పతకాలు భారత బాక్సర్ల ఖాతాలో చేరనున్నాయి.