»Revanth Reddy Hot Comments On Rakul Preet Singh Samantha And Ktr
Revanth Reddy: రకుల్, సమంత, KTRపై.. రేవంత్ హాట్ కామెంట్స్
TSPSC ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(revanth Reddy).. మంత్రి KTRపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీకు రూ.100 కోట్లు ఇచ్చి ఏంతైనా తిట్టికోవచ్చా అంటూ ఎద్దేవా చేశారు. సినిమా కోసం రకుల్ సంతకం పెట్టినట్లు, సమంత వెబ్ సిరీస్ కోసం ఒప్పుకున్నట్లు కాదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
TSPSCలో ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.100 కోట్లు ఇస్తే కేటీఆర్(KTR)ను ఏదైనా బుతులు తిట్టవచ్చా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన పరువును రూ.100 కోట్లకు రేటు కట్టవచ్చా అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు అసలు కేటీఆర్ కు పరువు ఉందా? ఉంటే దాని విలువ ఎంత అని నిలదీశారు. అయితే దాన్ని ఎవరు చెల్లిస్తారనేది తర్వాత విషయమని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇదేమైనా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సైన్ చేసినట్టా, లేదంటే సమంత తన సిరీస్ కోసం సంతకం పెట్టినట్లా అంటూ ఎద్దేవా చేశారు. ధర నిర్ణయించి అగ్రిమెంట్లు రాసుకోవడానికి ఇది మాములు విషయం కాదన్నారు.
తెలంగాణలో ఉన్న 30 లక్షల ఉద్యోగార్థుల జీవన మరణ సమస్య అని రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. మీరు విద్య విషయంలో కూడా అవినీతి చేయడమెంటని నిలదీశారు. ఈ క్రమంలో అనేక మంది ఉద్యోగార్థుల ఊసురు తగిలితే మీ కుటుంబం సర్వనాశనం అవుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను సీబీఐ, ఈడీ ద్వారా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మీ పాత్ర లేనప్పుడు ఎందుకు భయపడుతున్నారని రేవంత్ నిలదీశారు.
మరోవైపు TSPSC సంస్థలో పనిచేసే సాధారణ ఉద్యోగులు సైతం ప్రశ్న పత్రాలు అమ్ముకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం మోద్దు నిద్రపోతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకునే వారే కరువయ్యారని తెలిపారు. మరోవైపు వీళ్ల అయ్య కేసీఆర్ దేశాలు తిరుగుతున్నాడని గుర్తు చేశారు. ఇక కేటీఆర్ మాత్రం జూబ్లీహిల్స్ గెస్ట్ హోస్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని రేవంత్ అన్నారు. మరోవైపు ఈ కేసు విషయంలో ఆధారాలు బయటపెట్టిన ప్రతిపక్షాలపై సిట్ పేరుతో నోటీసులు జారీ చేస్తున్నారని పేర్కొన్నారు. అసలు నేరం శంకర్ లక్ష్మి ఆధ్వర్యంలో జరిగితే ఆమెను తప్పిస్తున్నారని రేవంత్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని చిన్నదిగా చూస్తుందని వెల్లడించారు.