SRD: భద్రాచలం సీతారాముల తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రీజనల్ మేనేజర్ ప్రభులత మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు లాజిస్టిక్ కేంద్రాలు 150 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవాలని చెప్పారు. సీతారాముల కళ్యాణం తర్వాత ఇంటికి వచ్చి తలంబ్రాలను తమ సిబ్బంది అందిస్తారని పేర్కొన్నారు.